Fourth Test: అద్భుతంగా ఆడిన టీమ్ ఇండియా.. నాలుగో టెస్ట్ డ్రా!

ఓటమి ఖాయం అనుకున్న సమయంలో భారత బ్యాటర్లు వీరోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేశారు. ఇంగ్లాండ్‌పై పోరాట పటిమను చూపిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్‌లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మూడు సెంచరీలతో భారత్ ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకుంది.

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ డ్రా అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 669 పరుగులు చేసి భారతపై భారీ ఆధిక్యం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 425/4 స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (103), రవీంద్ర జడేజా (103), వాషింగ్టన్ సుందర్ (101) సెంచరీలు చేసి భారత విజయ ఆశలు నిలబెట్టారు. కేఎల్ రాహుల్ 90 పరుగుల వద్ద అవుట్ అవుతూ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

చివరి రోజున ఆటలో ఇంకా 10 ఓవర్లు మిగిలి ఉన్నప్పటికీ, ఇరు జట్ల అంగీకారంతో అంపైర్లు మ్యాచ్‌ను అధికారికంగా డ్రా అని ప్రకటించారు. సుందర్ సెంచరీ పూర్తిచేసిన వెంటనే మ్యాచ్‌ను నిలిపివేశారు. ఈ ప్రదర్శనతో టీమ్‌ఇండియా తమ పోరాట శక్తిని మరోసారి నిరూపించుకుంది.

Leave a Reply