హిందీ టీవీ సీరియల్స్ తోపాటు బాలనటిగా పేరుగాంచిన రోష్ని వాలియా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ పోడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె.. సెక్స్ పై తన తల్లి ఇచ్చే సలహాలు గురించి బోల్డ్‌గా వెల్లడించారు.
View this post on Instagram
“మా అమ్మ మమ్మల్ని ఎంజాయ్ చేయమనే చెప్తుంది. సెక్స్ చేయాలి కానీ ప్రొటెక్షన్ తప్పనిసరిగా వాడాలి అని పదే పదే చెప్తుంటుంది. అక్కకి చెప్తే సరిపోదని, ఇప్పుడు నాకు కూడా అదే చెప్తోంది,” అంటూ ఆమె ఓపెన్‌గా వెల్లడించింది. “ఇంట్లో కూర్చోవద్దు, బయటకు వెళ్లి పార్టీలు చేసుకోండి, హ్యాపీగా ఉండండి అని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటుంది. మేము డల్‌గా ఉన్నా ఈరోజు ఎందుకు ఇలా ఉన్నావ్? తాగలేదా? అని కూడా అడుగుతుంది అని రోష్ని చెప్పింది.
తమ తల్లి త్యాగాల వల్లే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పిన రోష్ని, షూటింగ్లలో వృద్ధులతో ఎక్కువ టైమ్ గడిపినందువల్ల జీవితాన్ని త్వరగా అర్థం చేసుకున్నామని చెప్పింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని రాజకీయాలు, రూల్స్ అన్నీ చిన్న వయస్సులోనే తెలుసుకున్నానని వివరించింది. కొందరు తల్లిదండ్రులు పిల్లలతో ఇలాగే ఫ్రాంక్‌గా మాట్లాడటం మంచిదని ప్రోత్సహిస్తుంటే, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ కామెంట్స్ రోష్ని కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.