హరిహర వీరమల్లు కలెక్షన్లకు భారీ షాక్.. రెండో రోజే పడిపోయిన వసూళ్లు!

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. రిలీజ్ రోజు బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించి, పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్‌లో ఒకటిగా రికార్డ్ సృష్టించింది.

కానీ రెండో రోజుకి ఈ జోరు తగ్గిపోయింది. Sacnilk నివేదిక ప్రకారం, తొలి రోజు రూ. 34.75 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, రెండో రోజు మాత్రం కేవలం రూ. 7.77 కోట్లకే పరిమితమైంది. అంటే దాదాపు 70-75% వరకు కలెక్షన్లు పడిపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పతనం సినిమా థియేట్రికల్ రన్‌పై సందేహాలు రేకెత్తిస్తోంది. వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంటుందా? లేక ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? అన్నది చూడాలి. లేదంటే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం మార్నింగ్ షోలకు 21.71% ఆక్యుపెన్సీ, సాయంత్రం షోలకు 27.21% ఆక్యుపెన్సీ నమోదైంది. ఉదయం కంటే సాయంత్రం షోలు కొంచెం మెరుగ్గా నిలిచాయి.

మొత్తం రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రీమియర్స్ ద్వారానే రూ. 11 కోట్లకు పైగా వచ్చాయని టాక్. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లు రాబట్టినట్లు సమాచారం.

Leave a Reply