‘విశ్వంభర’ స్పెషల్ సాంగ్ కోసం హైదరాబాద్లో బాలీవుడ్ బ్యూటీ.. చిరుతో స్టెప్పులు కన్‌ఫర్మ్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ వేగంగా సాగుతోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ ఫాంటసీ డ్రామాలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మిస్తుండగా, ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ కొంతమంది ట్రోలింగ్‌కు గురి అయ్యాయి. దీంతో చిత్రబృందం గ్రాఫిక్స్ పనుల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. వీఎఫ్ఎక్స్ పనులను కూడా హాలీవుడ్ స్టూడియోకి అప్పగించినట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

ఇదిలా ఉంటే, ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ (Mouni Roy) మెగాస్టార్ సరసన స్టెప్పులేయనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తకు ఆమె బిగ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది.

మౌని రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, “విశ్వంభర స్పెషల్ సాంగ్ షూట్ కోసం హైదరాబాద్‌కి వచ్చాను” అంటూ ఫొటోలు షేర్ చేసింది. ఈ పాటను ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మూడు నుంచి నాలుగు రోజులపాటు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మాత్రం “చిరు-మౌని రాయ్ కాంబినేషన్‌లో ఈ స్పెషల్ సాంగ్ ఎలాంటి రేంజ్‌లో ఉంటుందా?” అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply