OTT: పోర్న్ కంటెంట్‌కి చెక్.. 25 ఓటీటీ యాప్‌లపై నిషేధం!

భారత ప్రభుత్వం అశ్లీల, అభ్యంతరకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన చర్యలు తీసుకుంది. కంటెంట్ నిబంధనలు ఉల్లంఘించి పోర్నోగ్రఫీ, వయోజన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీ యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధించింది.

ఎందుకు బాన్?
ప్రస్తుత డిజిటల్ యుగంలో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అశ్లీల కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా, ఉల్లు (Ullu), ఆల్ట్ (Altt), దేశీఫ్లిక్స్ (DesiFlix), బిగ్ షాట్స్ (Big Shots) వంటి యాప్‌లు పలుమార్లు కంటెంట్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించబడింది.

ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరిక!
ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఈ ప్లాట్‌ఫారమ్‌ల లింకులు పూర్తిగా బ్లాక్ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్‌కి ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఈ యాప్‌లు, వాటి వెబ్‌సైట్లు భారత్‌లో పనిచేయవు. కంటెంట్‌ను ఎవరూ యాక్సెస్ చేయలేరు.

భారతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. అలాగే ఓటీటీ యాప్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.

నిషేధించిన యాప్‌ల జాబితా
ఉల్లు (Ullu), ఆల్ట్ (Altt), దేశీఫ్లిక్స్ (DesiFlix), బిగ్ షాట్స్ (Big Shots), షోఎక్స్‌, సోల్ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ VIP, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియాన్‌ఎక్స్‌ VIP, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్‌, ట్రైఫ్లిక్స్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌, బుల్‌ యాప్‌, జాల్వా యాప్‌, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫినియో.

ఇకపై ఇలాంటి కంటెంట్‌కు భారత్‌లో గట్టి చెక్ పడనుంది.

Leave a Reply