Car Incident: గోడపైకి ఎక్కిన కారు.. చూసినవారికి షాక్, వీడియో వైరల్!

మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభీపూర్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. నిద్ర మత్తులో కారు నడుపుతున్న డ్రైవర్, నేరుగా ఒక ఇంటి గోడపైకి ఎక్కించాడు! ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఏం జరిగింది?
రాత్రివేళ ఇంటి యజమానులు సడన్‌గా భారీ శబ్దం విని బయటకు వచ్చి చూడగా, కారు ఏకంగా వాళ్ల ఇంటి గోడపై ఉంది. ఈ దృశ్యం చూసి వారు షాక్‌కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో కారును కిందకు దింపించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు గోడపైకి ఎలా ఎక్కిందన్నది ఇంకా క్లారిటీ రాలేదు. నిజంగా నిద్ర మత్తులో జరిగిందా? లేక మద్యం మత్తులో జరిగిందా? అనేది స్థానికుల మధ్య చర్చనీయాంశమైంది.

సోషల్ మీడియాలో వైరల్!
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. “బ్రో.. కారుని గోడపైకి ఎలా పెట్టావ్?”, “ఇంకో క్వార్టర్ వేసుంటే పైకప్పుపై పెట్టేవాడేమో!” అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply