HHVM Collections: హరిహర వీరమల్లు ఫస్ట్ డే వసూళ్లు.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు భారీ అంచనాల మధ్య గురువారం (జూలై 24)న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకుని, ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ నటించిన తొలి సినిమా కావడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. బ్రో తర్వాత వచ్చిన ఈ మూవీకి ఫస్ట్ పోస్టర్, ట్రైలర్‌ నుంచే సోషల్ మీడియాలో భారీ క్రేజ్‌ కనిపించింది. చాలా కాలం తర్వాత పవన్ మాస్, యాక్షన్ అవతార్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం మరింత రెట్టింపైంది.

విడుదలకి ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు హౌస్‌ఫుల్‌గా జరిగాయి. ఓపెనింగ్ డే ఉదయం నుంచి బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలు, మ్యాట్నీ షోలు వరకూ థియేటర్లు ఫుల్‌ అయ్యాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సినిమా బ్లాక్‌బస్టర్ అని సెలబ్రేట్ చేస్తున్నారు.

మొదటి రోజే ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఓపెనింగ్‌గా రికార్డ్ సృష్టించింది. భారతదేశంలోనే రూ.31.50 కోట్లు వసూలు చేయగా, ప్రీమియర్ షోల ద్వారా ₹12.7 కోట్లు రాబట్టి, మొత్తం ఫస్ట్ డే కలెక్షన్ ₹43.8 కోట్లు చేరుకుంది. తెలుగు వెర్షన్ సగటున 57.39% ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది.

Leave a Reply