హీరో విజయ్ దేవరకొండకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విజయ్ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ నెల 31న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసింది.
దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 వరకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్రత్యేక రేట్లు విడుదల తేదీ నుంచి 10 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
భారీ అంచనాలతో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ కథానాయికగా నటిస్తోంది.
#Kingdom Get Ticket Hike's Aproval
In AP.🎟️ Single Screens – Up to ₹50/-
🎬 Multiplexes – Up to ₹75/-Very Reasonable Hikes.❤️
Wait For TS Hike's.Get ready for the @TheDeverakonda's Havoc 🌋 #KingdomOnJuly31st pic.twitter.com/yI624eQytn
— VIJAY DEVERAKONDA Edits (@VDKEdits) July 24, 2025
విజయ్ ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్‌ను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిన తర్వాత, అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథలో ప్రధానాంశం. ఇందులో విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారు.
ఇప్పటికే వీరిద్దరి బంధం నేపథ్యంతో విడుదలైన “అన్నా అంటే” సాంగ్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
విజయ్ దేవరకొండ గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. అందువల్ల కింగ్డమ్ విజయం ఆయన కెరీర్‌కి కీలకంగా మారనుంది.