హరిహర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అమరావతిలో జరుగుతున్న క్యాబినెట్ సమావేశానికి వచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకున్నారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారితో గత పదేళ్లలో పలుమార్లు సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష– ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే… https://t.co/NXeSlrAuNR
— Pawan Kalyan (@PawanKalyan) July 23, 2025
ఇక అంతకుముందు చంద్రబాబు, హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ, “మెగా అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు జూలై 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 23 రాత్రి ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు విజయవంతంగా జరిగాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.
చంద్రబాబు ఈ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎమోషనల్ రియాక్షన్ ఇచ్చారు.
“చంద్రబాబు గారు ఆప్యాయంగా చేసిన ఈ పోస్ట్ నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించింది. గత పదేళ్లలో ఆయనను పలుమార్లు కలిసినా సినిమాల ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. కానీ ఈ రోజు ‘హరిహర వీరమల్లు’ గురించి ఆయన అందించిన శుభాకాంక్షలు విజయానికి సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తించుకునే వెసులుబాటు ఇచ్చి, చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు” అని పవన్ రీట్వీట్ చేశారు.