సౌత్ ఆఫ్రికా లెజెండరీ క్రికెటర్ AB డివిలియర్స్ (AB De Villiers) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుగాంచిన డివిలియర్స్ ఇప్పుడు మళ్లీ క్రికెట్ మైదానంలో మెరిస్తున్నాడు.
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికా చాంపియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఆడుతున్న డివిలియర్స్, బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లో కూడా తన మ్యాజిక్ చూపిస్తున్నాడు.
AB DE VILLIERS AT 41 >>> MOST FIELDERS AT 25 💀
This catch is pure madness 🔥
Never doubt the GOAT energy 🐐#WCL #ABD #CricketFreakpic.twitter.com/3iBL6vJVr7— MindSportsMarvel (@MSportsMarvel) July 22, 2025
ఇండియా vs సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో సంచలనం
ఇటీవల జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో డివిలియర్స్ అదరగొట్టాడు. కేవలం 30 బంతుల్లోనే 63 పరుగులు చేసి తన పాత స్టైల్‌ను గుర్తు చేశాడు. అంతే కాదు, ఫీల్డింగ్‌లో కూడా అసాధారణ ప్రతిభ కనబర్చాడు.
యూసఫ్ పఠాన్ లాంగ్ ఆఫ్ వైపు బౌండరీ దాటేలా భారీ షాట్ ఆడగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న డివిలియర్స్ డైవ్ చేస్తూ బంతిని పట్టుకొని, గాల్లోకి విసిరి పక్కనే ఉన్న మరో ప్లేయర్ చేతికి అందించాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
41 ఏళ్ల వయసులో కూడా ఇంత అద్భుతమైన ఫీల్డింగ్ చేయడం నిజంగా గొప్ప విషయమని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.