Pulasa Fish: రికార్డులు బ్రేక్ చేసిన పులస.. ఈసారి ఎంత ధర పలికిందో తెలుసా?

వర్షాకాలం ప్రారంభమైతే గోదావరి తీర ప్రాంతాల్లో మత్స్యకారులకు అదృష్టం పులస రూపంలో వస్తుంది. గోదావరి నదిలో మాత్రమే దొరికే ఈ పులస చేప (Pulasa Fish) కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కిలో చేపకే రూ.5 వేల నుంచి 30 వేల వరకు వెచ్చించే వారు ఉండటమే దీని ప్రాముఖ్యతను చెప్పడానికి సరిపోతుంది.

ఇటీవల గోదావరి ఉప్పొంగుతుండటంతో పులసలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కానీ ఈసారి పులస చేపలు ఎక్కువగా దొరకకపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తాజాగా యానాంలో గంగపుత్రుల వలలో చిక్కిన 2 కేజీల పులస చేప రికార్డు సృష్టించింది. ఈ చేపను ఏకంగా రూ.26 వేలకే ఆత్రేయపురం, పేరవరం ప్రాంతానికి చెందిన బెజవాడ సతీష్ వేలంలో కొనుగోలు చేశారు.

గత జూలై 21న జరిగిన వేలంలో 2 కేజీల పులస రూ.22 వేలకే అమ్ముడైంది. అయితే ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పలికిన అత్యధిక ధరగా నిలిచిందని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply