తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఫలితాలను ప్రకటించారు. జూన్ 18 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించగా, మొత్తం 1,37,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఫలితాల్లో మొత్తం 33.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో పేపర్-1లో 61.50% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, పేపర్-2లో మాత్రం 33.98% మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పేపర్-1కు 90,205 మంది హాజరయ్యగా, 30,649 మంది విజయవంతమయ్యారు.
#Hyderabad—#Telangana TET results out!
Education Secretary Yogita Rana announced the Teacher Eligibility Test results on Tuesday.The exams were held online from June 18-30 with 1.37 lakh candidates appearing.
#Telangana #TET #Results pic.twitter.com/uF87jWOXtS
— NewsMeter (@NewsMeter_In) July 22, 2025
ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్స్ https://tgtet.aptonline.in/tgtet/ మరియు https://schooledu.telangana.gov.in/ లో చూసుకోవచ్చు.
ఇక టీజీ టెట్ పరీక్షకు మొత్తం 1,83,653 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1ను ఆరు సెషన్లలో 7 భాషల్లో – తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాళీ – నిర్వహించారు. పేపర్-2ను పది సెషన్లలో తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, సంస్కృత భాషల్లో నిర్వహించగా, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం వంటి విషయాల్లో నిపుణతను పరీక్షించారు.