పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం కేవలం వృత్తిపరమైనది మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా ఒకరికొకరు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ నిజమైన స్నేహానికి ఉదాహరణగా నిలుస్తున్నారు. తాజాగా ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో కష్టకాలంలో త్రివిక్రమ్ ఇచ్చిన సపోర్ట్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడారు.
“నా నిజమైన మిత్రుడు త్రివిక్రమ్”
పవన్ మాట్లాడుతూ.. “నేను పదేళ్ల పాటు వరుస ప్లాపులతో సతమతమయ్యాను. ఒకప్పుడు వరుసగా హిట్స్ ఇస్తూ ఉండి ఒక్క ప్లాప్‌తోనే కిందపడ్డాను. ఆ తర్వాత సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోవడంలో కూడా తడబడ్డాను. అప్పుడు నా జీవితంలోకి త్రివిక్రమ్ వచ్చాడు. ‘జల్సా’ సినిమాతో నాకు పెద్ద హిట్ ఇచ్చి తిరిగి నిలబడేలా చేశాడు. అప్పటివరకు త్రివిక్రమ్ ఎవరో కూడా నాకు తెలియదు. కానీ మేమిద్దరం కలసి సినిమా చేశాం, అది నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అయ్యింది. సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎవరైనా వెతుక్కుంటూ వస్తారు. కానీ అపజయాల్లో నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిజమైన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కష్టకాలంలో భగవంతుడు ఇచ్చిన వరం లాంటి మిత్రుడు త్రివిక్రమ్” అని పవన్ ఎమోషనల్‌గా చెప్పారు.
#PawanKalyan About #Trivikram
” నేను ఫ్లోప్స్ లో ఉన్నప్పుడు
నాతో పాటు నిలబడింది త్రివిక్రమ్హిట్ ల్లో అందరూ తోడు ఉన్నారు, కష్టాల్లో వదిలేశారు ఆ టైం లో #Jalsa తీసిన వ్యక్తి త్రివిక్రమ్
భగవంతుడు ఇచ్చిన స్నేహితుడు..#HariHaraVeeraMallu #HHVM pic.twitter.com/NapK8LS7gv
— IndiaGlitz Telugu™ (@igtelugu) July 21, 2025
పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ స్నేహం కేవలం సినిమాల వరకే పరిమితం కాలేదు. పవన్ రాజకీయ ప్రయాణానికి కూడా త్రివిక్రమ్ బలమైన అండగా నిలిచారు. పవన్ మీటింగ్స్, సభలకు హాజరై ఆయన ఆలోచనలకు తన మాటలతో ప్రాణం పోయడం, సపోర్ట్‌గా నిలవడం వంటి విషయాలు వారి బలమైన బంధానికి నిదర్శనం.