తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కి రూ. కోటి నగదు బహుమతిని ప్రకటించింది. పాతబస్తీ బోనాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, “సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు. పాతబస్తీ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వించదగిన విషయం” అని ప్రశంసించారు.
ఇక 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ సాధించిన రాహుల్ సిప్లిగంజ్‌కి కోటి రూపాయల బహుమతి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టి, బోనాల సందర్భంగా నగదు బహుమతిని ప్రకటించారు.
ప్రఖ్యాత గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారికి ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
✅పాతబస్తీకి చెందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ #RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా… pic.twitter.com/VTED2wF2W1
— Telangana CMO (@TelanganaCMO) July 20, 2025
గల్లీ నుంచి ఆస్కార్ వరకు రాహుల్ ప్రయాణం
చిన్న గల్లీ నుంచి తన సంగీత ప్రస్థానం ప్రారంభించిన రాహుల్, ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ వేదికపై నిలిచాడు. తెలంగాణ కుర్రాడిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాహుల్ ప్రతిభను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఈ బహుమతిని అందజేసింది.
ఇది రాహుల్‌తో పాటు తెలంగాణలోని ఎంతోమంది యువ కళాకారులకు స్ఫూర్తి, ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
‘నాటు నాటు’ పాట తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గీతం. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడారు. ఈ పాటతో రాహుల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.