రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం కొనసాగుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలు గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నా కోరిక ఒక్కటే
నువ్వు అసెంబ్లీ రావాలి
మేము చేసిన అభివృద్ధి వినాలి… 🔥చంద్రశేఖర్ రావు నువ్వు పాలమూరికి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు..
పాలమూరు అభివృద్ధి నా బాధ్యత ❤️
~ సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/MxWrSEIwrl— Kattar Congress (@kattarcongresii) July 18, 2025
“మా పాలమూరు ప్రాజెక్టులకు అడ్డంకులు పెట్టొద్దు. రెండు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి కోసం నిజంగా మీరు కృషి చేస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి, మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సహకరించండి” అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
“మీరు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం ఉన్నప్పుడు కల్వకుర్తి ప్రాజెక్టు ప్రారంభమైంది. బీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులు కూడా మీ కాలంలోనే వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. కానీ కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. ఇప్పుడు మీరు ఇవి అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం?” అని ప్రశ్నించారు.
“గతంలో పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నానని చెప్పారు. ఇప్పుడు మా ప్రాజెక్టులు పూర్తిచేసుకోనిచ్చి మమ్మల్ని బ్రతకనివ్వండి. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం వెనకనుంచి 4 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంటే, ఇప్పుడు తొమ్మిదిన్నర టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టులు మీరు ఎందుకు పెడుతున్నారు? రోజుకు 3 టీఎంసీల నీళ్లు తరలించే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి మీ ఉదారత చూపించండి” అని వ్యాఖ్యానించారు.
“మా విజ్ఞప్తులు వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరుకు తెలుసు. మాకు పౌరుషం ఉంది, పోరాడి సాధించుకునే శక్తి ఉంది. ఈ పోరాటానికి నేను నాయకత్వం వహిస్తాను. ఇక్కడ సూర్యుడు అక్కడ ఉదయించినా, అక్కడ సూర్యుడు ఇక్కడ ఉదయించినా పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయడం నా బాధ్యతే” అని రేవంత్ హెచ్చరించారు.