హైదరాబాద్‌లో కుండపోత వర్షం దంచికొడుతోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లన్నీ జలమయమై, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మధ్యాహ్నం వరకు ఉక్కపోత వాతావరణం ఉండగా, ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వాతావరణ శాఖ మరో మూడు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.
Heavy Rainfall in Habsiguda – Secunderabad Belt #HyderabadRains @balaji25_t @Hyderabadrains pic.twitter.com/f9x7KJgDhd
— Reon Sylvester D Cunha (@Riosylvestria98) July 18, 2025
భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాల రాకపోకలు స్తంభించాయి. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, హైడ్రా ఫోర్స్ బృందాలు రోడ్లపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
#HYDTPinfo #RainAlert
Due to heavy #Rainfall, waterlogged near Railway Degree college Tarnaka causing slow traffic movement.@shotr_oucity along with #DRF team is on spot, clearing the stagged water and regulating traffic.
#HyderabadRains #Monsoon2025 #MonsoonSession2025 pic.twitter.com/0bfhSc6YKM— Hyderabad Traffic Police (@HYDTP) July 18, 2025
తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలో రోడ్లపై వరద నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. DRF బృందం నిలిచిపోయిన నీటిని క్లియర్ చేసి ట్రాఫిక్‌ను సజావుగా మార్చే ప్రయత్నం చేసింది.
ఉప్పల్‌లో భారీగా వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూసఫ్‌గూడ, కృష్ణానగర్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా మాన్హోల్స్ తెరుచుకుని డ్రైనేజ్ నీరు రోడ్లపైకి రావడంతో మోకాలి లోతులో వరద నీరు ప్రవహిస్తోంది.