జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ నుంచి ఫుల్ ఫోకస్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీ పనులపైనే దృష్టి పెట్టాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. కూటమిలో కొనసాగుతూనే, జనసేనను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక వ్యూహాలు రూపొందించాలనుకుంటున్నారు.

21 నియోజకవర్గాలపైనే కాకుండా మరిన్ని ప్రాంతాల్లో సర్వే
ప్రస్తుతం గెలిచిన 21 నియోజకవర్గాలతో పాటు మరో 60 నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏంటో తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి బలం ఉన్న 50 కీలక నియోజకవర్గాలను గుర్తించారని, ఆ ప్రాంతాల్లో త్వరలోనే జిల్లావారీగా అధ్యక్షులను నియమించాలనే నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఇంటింటికీ జనసేన కార్యక్రమం
ఇక ఇంటింటికీ వెళ్లే ప్రత్యేక కార్యక్రమం ద్వారా పార్టీని గ్రౌండ్ లెవల్‌లో బలోపేతం చేయాలని పవన్ ఆలోచిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తదుపరి ఎన్నికల్లో పార్టీ మరింత శక్తివంతంగా ఉండాలని భావించి ఈ చర్యలకు సిద్ధమవుతున్నారు.

Leave a Reply