Karnataka: సినిమా టికెట్ ధరలపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం

కర్ణాటక ప్రభుత్వం సినిమా ప్రియులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ ధరను రూ.200కి పరిమితం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నిర్ణయం ప్రకారం, కన్నడ సినిమాలు మాత్రమే కాదు, అన్ని భాషల సినిమాలకు కూడా ఇదే పరిమితి వర్తిస్తుంది. వినోద పన్ను సహా ఒక్కో షో టికెట్ ధర రూ.200 మించరాదు. అలాగే బాల్కనీ, ప్రీమియం, సాధారణ సీటు అన్ని సీట్లకు ఒకే ధర వర్తిస్తుంది.

15 రోజుల గడువు
ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం 15 రోజుల గడువు ఇచ్చింది. ఆ తర్వాత తుది నిర్ణయం వెలువడనుంది.

ప్రభుత్వం ఈ నిర్ణయంతో సామాన్యులకు సినిమా చూడటం మరింత అందుబాటులోకి వస్తుందని చెబుతోంది. కన్నడ సినిమా పరిశ్రమకు కూడా ఇది మేలు చేస్తుందని చలనచిత్ర వర్గాలు స్వాగతిస్తున్నాయి. అయితే, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మాత్రం తమ ఆదాయం భారీగా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి, హోం శాఖ, విధాన సౌధ, బెంగళూరు-560 001కు పంపవచ్చు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో సినిమా టికెట్ ధరల పరిమితిని అమలు చేస్తామని ప్రకటించారు.

Leave a Reply