Raviteja: హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు (90) నిన్న రాత్రి హైదరాబాద్‌లోని రవితేజ నివాసంలో కన్నుమూశారు.

రాజగోపాల్ రాజుకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. రవితేజ పెద్ద కొడుకు కాగా, రెండో కొడుకు భరత్‌ 2017లో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మూడో కొడుకు రఘు.

అంత్యక్రియలు
రాజగోపాల్ రాజు అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గంపేట స్వగ్రామంలో నిర్వహించనున్నారు.

కుటుంబ జీవితం
రాజగోపాల్ రాజు భూపతి రాజు ఫార్మసిస్ట్‌గా పనిచేసేవారు. ఉద్యోగ ట్రాన్స్‌ఫర్‌ల కారణంగా కుటుంబం పలు ప్రాంతాల్లో నివసించాల్సి వచ్చేది. ఈ కారణంగా రవితేజ కూడా చిన్నతనంలో జైపూర్‌, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఉండేవారు. అందుకే ఆయనకు పలు ప్రాంతాల యాసలు అలవాటు అయ్యాయని రవితేజ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి సంతాపం
రాజగోపాల్ రాజు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. “ఆయనను చివరిసారిగా వాల్తేరు వీరయ్య సినిమా సెట్‌లో కలిశాను. రవితేజ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు.

Leave a Reply