Sreeleela: జూనియర్ మూవీ కోసం శ్రీలీల భారీ రెమ్యూనరేషన్..!

టాలీవుడ్‌లో అత్యంత వేగంగా ఎదిగిన కథానాయికల్లో శ్రీలీల పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ యువ హీరోయిన్.. కేవలం కొద్ది సినిమాల్లోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంది. రవితేజ, నితిన్, మహేష్ బాబు లాంటి టాప్ హీరోలతో కలిసి నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. డాన్స్‌ పరంగా సాయి పల్లవిని గుర్తు చేసే రీతిలో తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ దూసుకెళుతోంది శ్రీలీల.

ఇప్పుడు ఈ హాట్ అండ్ హాపెనింగ్ బ్యూటీ, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెరకెక్కిన ‘జూనియర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. జెనీలియా ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం జూలై 18న తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి హైప్‌ తీసుకొచ్చాయి.

శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతంటే..?
ఈ సినిమా కోసం శ్రీలీల భారీ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పుష్ప 2 ఐటెం సాంగ్‌కు రెండు కోట్ల రూపాయలు తీసుకున్న శ్రీలీల, ‘జూనియర్’ సినిమాకు మరింతగా డిమాండ్ పెంచినట్లు సమాచారం. తాజా గాసిప్ ప్రకారం, ఈ ఒక్క సినిమా కోసం ఆమె రూ. 2.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుందట. అంటే ఆమె మార్కెట్ ఏ రేంజ్‌కు చేరిందో అర్థమవుతోంది.

శ్రీలీల క్రేజ్, ఆమె డాన్స్ స్కిల్స్, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ అన్నీ జతకావడంతో నిర్మాతలు భారీగా ఇవ్వటానికి వెనుకాడడం లేదు. జూనియర్ సినిమాతో ఆమెకు మరో హిట్ ఖాతాలో పడుతుందా? అన్నదే ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.

Leave a Reply