Shilpa Shetty: గ్రీన్ శారీలో మెరిసిపోతున్న శిల్పా శెట్టి.. నెట్‌లో వైరల్ ఫోటోలు!

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ శిల్పా శెట్టి తాజాగా గ్రీన్ శారీలో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోతుంది. ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

50 ఏళ్ల వయసులోనూ శిల్పా ఫిట్‌నెస్‌తో పాటు ఫ్యాషన్‌లోనూ యూత్‌కి టఫ్ కాంపిటీషన్ ఇస్తుండటమే గాక, ఆమె స్టైల్ సెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు “వావ్”, “స్టన్నింగ్”, “అందం అంటే ఇదే” అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌తో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న శిల్పా.. ఈసారి గ్రీన్ శారీలో గ్లామర్ డోస్‌ను పెంచేసింది.

సినిమాలకంటే ఎక్కువగా టీవీ షోల్లో జడ్జ్‌గా కనిపించే శిల్పా “సూపర్ డాన్సర్”, “ఇండియాస్ గాట్ టాలెంట్” వంటి షోలతో కోట్లాది మందికి చేరువైంది.

అంతర్జాతీయ స్థాయిలో కూడా తన సత్తా చాటిన ఈ బ్యూటీ, ‘బిగ్ బ్రదర్’ షోలో టైటిల్ గెలుచుకుని వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకుంది.

నటి, మోడల్, టీవీ హోస్ట్ మాత్రమే కాకుండా శిల్పా ఓ ట్రెయిన్డ్ భరతనాట్యం నర్తకి కూడా. వయసు పెరుగుతున్నా గ్లామర్‌కి మాత్రం కొంచెం కూడా తగ్గడం లేదు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే.. నిజంగానే చూపు తిప్పుకోవడం కష్టం!

Leave a Reply