Renu Desai: రేణు దేశాయ్ సర్జరీ.. ఏం జరిగింది అనే ఉత్కంఠలో నెటిజన్లు!

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, ఒకప్పటి హీరోయిన్‌గా రేణు దేశాయ్‌కి ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం ఉంది. సినిమాలకు దూరమైన ఆమె ఇటీవలే తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే, సినిమా కెరీర్‌ కన్నా ఎక్కువగా రేణు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తరచూ షేర్ చేస్తూ అభిమానులతో చర్చలో ఉంటుంది.

ఇప్పుడు రేణు దేశాయ్ పెట్టిన తాజా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్‌గా మారింది. తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన రేణు… “మొత్తానికి నా సర్జరీ తర్వాత నా క్యూటీస్‌తో బయటకు డిన్నర్‌కి వచ్చాను” అని రాసింది. ఆ ఫోటోలో రేణు ముఖంలో కొంత అలసటగా కనిపించడం గమనార్హం. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఏం సర్జరీ జరిగిందో ఆమె ఎందుకు చెప్పలేదని ప్రశ్నలు వేస్తున్నారు.

ఇప్పటివరకు ఆమె ఏ రకమైన సర్జరీ చేయించుకుందో స్పష్టంగా చెప్పలేదు. అయితే గతంలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు రేణు స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. దాంతో ఈసారి గుండెకు సంబంధించిన సర్జరీ చేశారా? లేక ఇతర ఆరోగ్య సమస్యల నిమిత్తంగా సర్జరీ జరిగిందా? అనే అనుమానాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు ఈ విషయంపై రేణు దేశాయ్ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అభిమానులు మాత్రం ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. రేణు తన ఆరోగ్య పరిస్థితి గురించి త్వరలోనే ఓ అధికారిక స్పష్టత ఇస్తుందా? అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

Leave a Reply