కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్..! హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్ నగర ప్రజలకు తీపి కబురు అందించింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. తాజాగా ఇందిరమ్మ క్యాంటీన్లలో కేవలం రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం ద్వారా నిత్యం వేలాది మంది పేదలకు నాణ్యమైన అల్పాహారం అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సేవను హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ అమలు చేయనుంది. ఒక్కో టిఫిన్ ప్లేట్‌కు అసలు ఖర్చు రూ.19 కాగా, ప్రజల నుంచి కేవలం రూ.5 మాత్రమే వసూలు చేస్తారు. మిగిలిన రూ.14 ఖర్చును జీహెచ్ఎంసీ భరించనుంది. ఈ స్కీమ్ అమలుకు ప్రతి సంవత్సరం రూ.15.33 కోట్లు ఖర్చు అవుతుంది.

పాత క్యాంటీన్లకు అప్‌గ్రేడ్ – కొత్త వసతుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు:

పాత క్యాంటీన్లను నూతనీకరించేందుకు, క్యాంటీన్ కంటైనర్ల ఏర్పాటుకు రూ.11.43 కోట్లు ఖర్చు చేయనున్నారు.

చెరువుల అభివృద్ధి, ట్యాంక్ బండ్ పునరుద్ధరణ
కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద నగరంలోని చెరువులను అభివృద్ధి చేయనున్నారు.

సరూర్‌నగర్ ట్యాంక్ బండ్ రిపేర్లకు రూ.5.60 కోట్లు మంజూరు చేశారు.

బుద్ధ భవన్‌ను హైడ్రా కార్యాలయం & తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కి లీజుకు ఇవ్వడానికి ఆమోదం లభించింది.

ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్వహణకు భారీ నిధులు
హైదరాబాద్ నగరంలో నిర్మించిన 23 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్వహణ కోసం ఏటా రూ.13.59 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇందిరమ్మ క్యాంటీన్ల పునఃప్రారంభంతోపాటు ఇతర పౌర అవసరాలపై ఈ చర్యలు నగర అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వం చూపుతున్న దృక్పథానికి నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply