Pragya Jaiswal: వైట్ బికినీలో హీటెక్కిస్తున్న బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్..!

బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మళ్లీ ఓసారి హీటు పెంచేసింది. తాజాగా వైట్ కలర్ బికినీలో స్టైలిష్ ఫోటోషూట్‌ తో అందాల విందు ఇచ్చింది. గ్లామర్ ట్రీట్‌తో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వైట్ స్విమ్ సూట్‌లో ప్రగ్యా అటిట్యూడ్, ఆ హాట్ లుక్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “అందంగా ఉన్నావ్”, “ఫిట్‌గా ఉన్నావ్”, “గ్లామర్‌కి డెఫినిషన్ నువ్వే” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్ మొదటిగా వరుణ్ తేజ్ సరసన ‘కంచె’ సినిమాలో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినా పెద్దగా హిట్ అందుకోలేకపోయింది.

అయితే 2021లో బాలకృష్ణ సరసన నటించిన ‘అఖండ’ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఈ మూవీ విజయంతో ప్రగ్యాకు తెలుగులో మంచి ఆఫర్లు రావడం మొదలైంది.

ప్రస్తుతం ‘అఖండ 2’ లో కూడా ప్రగ్యా కీలక పాత్రలో నటిస్తోంది. అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘టైసన్ నాయుడు’ సినిమాలోనూ నటిస్తోంది.

సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ప్రగ్యా రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది.

తెలుగు సినిమాలతో పాటు హిందీ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టిన ప్రగ్యా, బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి ‘ఖేల్ ఖేల్ మేన్’ సినిమాలో నటించింది. అలాగే ‘ఆచారి అమెరికా యాత్ర’, ‘నక్షత్రం’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’ వంటి చిత్రాల్లోనూ కనిపించింది.

Leave a Reply