టాలీవుడ్‌లో టాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నభా నటేశ్ ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. కెరీర్ ఆరంభంలో ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, అప్పటి వరకూ వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ అవుతుందనే ఆశలు నెలకొన్నాయి. కానీ ఆ పయనం మధ్యలోనే ఆగిపోయింది.
తెలుగులో వరుస ఫ్లాపులు, అనంతరం జరిగిన ప్రమాదం కారణంగా నభా నటేశ్ కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ప్రస్తుతం కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ కొనసాగిస్తోంది.
ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీలో నటిస్తోంది. ఇందులో సంయుక్త మీనన్ మెయిన్ హీరోయిన్ అయినా, నభా పాత్ర కూడా కీలకమే అంటున్నారు.
ఇక సినిమాల కంటే ఎక్కువగా నభా సోషల్ మీడియాలోనే హల్‌చల్ చేస్తోంది. తరచూ హాట్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, తాజాగా చీరకట్టులో పోజులిచ్చిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
సంప్రదాయ వస్త్రధారణలో కూడా నభా అందాన్ని అసలు తగ్గించకుండా చూపిస్తూ ఫ్యాన్స్‌ను మత్తెక్కిస్తోంది.
టాలెంట్, గ్లామర్ రెండూ ఉన్నా.. టాలీవుడ్‌లో మాత్రం నభాకు సరైన ఆఫర్స్ రావడం లేదు. చిన్న సినిమాలే తప్ప, మళ్లీ ఒక సాలిడ్ బ్రేక్ ఆమె ఖాతాలో చేరలేదు.
కానీ, సోషల్ మీడియాలో తన క్రేజ్ కొనసాగిస్తూనే, మరోసారి మంచి పాత్ర కోసం ఎదురుచూస్తోంది నభా నటేశ్.