స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ప్రకటన

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ యోచన అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఇప్పటికే పది మంది సమర్థుల జాబితా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

“కేటీఆర్ స్థాయి నాకు సరిపోదు” – పీసీసీ చీఫ్
కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించాలంటే ఆయన స్థాయిలో ఉండాలంటూ పీసీసీ చీఫ్ ఘాటుగా స్పందించారు.

“ప్రజల సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ ఉంది. బీఆర్ఎస్ మాత్రం అసత్యాలు చెప్పే పార్టీగా మారింది” అని విమర్శించారు.
యూరియా కొరతపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఖండించిన మహేష్ కుమార్, “మా ప్రభుత్వం యూరియా సరఫరా పెంచింది. కానీ బీఆర్ఎస్ అవాస్తవ ప్రచారమే చేస్తోంది” అన్నారు.

కమిటీలు, నియామకాలపై కీలక అప్డేట్లు
15వ తేదీలోగా కొత్త డీసీసీ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కమిటీల ఏర్పాటుకు సీనియర్ ఇన్ఛార్జ్‌లను నియమించినట్లు చెప్పారు.

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ అబ్జర్వర్లు త్వరలో రాష్ట్రానికి రానున్నారని వెల్లడించారు.

ఈ నెల చివరినాటికి అన్ని కమిటీలు పూర్తి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

అసెంబ్లీ సీట్ల పెంపు, మహిళల హక్కులపై దృష్టి
మహిళల సీట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని,

త్వరలో అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశముందన్నారు.

పార్టీ సూత్రాలను ప్రశ్నించే స్వేచ్ఛ కాంగ్రెస్‌లో ఉందని, అందుకే నిరసనలు బయటపడుతున్నాయని తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆత్మవిశ్వాసం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ధీమాగా మాట్లాడిన మహేష్ గౌడ్.. “అక్కడ బరిలోకి దిగేందుకు 10 మంది సమర్థులున్నారు. వేరే పార్టీ అభ్యర్థిని తీసుకునే ప్రసక్తే లేదు” అని తేల్చిచెప్పారు.

ఇందులో భాగంగా తాను అరెస్ట్‌కి గురైన విషయాన్ని గుర్తు చేస్తూ, కాళేశ్వరం అవినీతిపై మాట్లాడితే ప్రభుత్వం నిర్బంధాల పేరిట అరెస్ట్ చేసిందన్నారు.

రాజకీయ అవకాశాలపై స్పందన
మంత్రి పదవుల అంశం తన పరిధిలో లేదని స్పష్టం చేశారు.

జూనియర్లకూ, సీనియర్లకూ సమాన గౌరవం పార్టీలో ఉంటుందని తెలిపారు.

ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

తాజాగా జరిగిన సర్వేల్లో కాంగ్రెస్‌కి మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు.

Leave a Reply