మొబైల్ వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్. ఇప్పటికే భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు మళ్లీ పెరగబోతున్నాయి. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తదితర కంపెనీలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి 10% నుంచి 12% వరకు టారిఫ్ పెంపు చేసే యోచనలో ఉన్నాయి. ఈసారి మధ్యస్థ (Mid-range) మరియు హై-రేంజ్ ప్లాన్లు టార్గెట్ అయ్యే అవకాశముంది.
ఈసారి ప్లాన్ ధరలు పెంచే విషయంలో బేసిక్ యూజర్లకు బదులుగా, అధిక డేటా వాడేవారిని లక్ష్యంగా పెట్టేలా కంపెనీలు కొత్త టారిఫ్ విధానాలను రూపొందిస్తున్నాయి. 2024 జూలైలో టెలికాం సంస్థలు చివరిసారిగా ధరలు పెంచినప్పుడు బేసిక్ ప్లాన్‌లపై 11%–23% వరకూ పెంపు జరిగింది. కానీ ఈసారి మిడ్, హై-ఎండ్ యూజర్లపై భారం పడేలా ఉండనుంది.
7.4 మిలియన్ల కొత్త యాక్టివ్ మొబైల్ యూజర్లు భారత మార్కెట్‌లో చేరారు
జియో: 5.5 మిలియన్లు
ఎయిర్‌టెల్: 1.3 మిలియన్లు
మొత్తం యాక్టివ్ యూజర్లు: 1.08 బిలియన్
ఈ వృద్ధి చూస్తే, టారిఫ్ పెంపుతోపాటు సంస్థలు తమ ఆదాయాన్ని కూడా మరింతగా పెంచేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.
నిపుణుల అంచనా ప్రకారం, టెలికాం సంస్థలు త్వరలోనే డేటా వినియోగం, టైమ్ స్లాట్ ఆధారంగా టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఉదాహరణకి:
తక్కువ డేటా వాడే యూజర్లకు ప్రత్యేక ప్లాన్
అర్థరాత్రి సమయంలో వాడే వారికి డిస్కౌంట్ రేట్లు
డేటా ప్యాక్‌లను ప్రత్యేకంగా కొనాల్సిన పరిస్థితి
ప్రముఖ మార్కెట్ అంచనాల ప్రకారం, 2025 నుంచి 2027 మధ్యకాలంలో టెలికాం రంగం ఆదాయం రెండంకెలలో పెరుగుతుందని భావిస్తున్నారు. వినియోగదారులు ఖర్చుపై మరింత జాగ్రత్తగా ఉండే పరిస్థితి కూడా ఏర్పడనుంది.