బుల్లితెర బ్యూటీ ఆశు రెడ్డి మరోసారి తన గ్లామర్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా బీచ్‌లో షూట్ చేసిన ఫోటోస్‌తో నెటిజన్ల మనసులు దోచేసింది. బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్సులో ఆసక్తికరమైన హాట్ పోజులిచ్చిన ఆశు.. తన ఫాలోవర్లను ఫిదా చేస్తోంది.
ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసిన వెంటనే, నెట్టింట ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. “స్టన్నింగ్”, “సూపర్”, “ఫైర్” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘జూనియర్ సమంత’గా పేరొందిన ఆశు రెడ్డి, బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, టీవీ షోల్లో తళుక్కుమంది.
ఇటీవలే బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్న ఆశు.. మళ్లీ షోలు, షూట్లతో బిజీగా మారింది. ‘ఛల్ మోహన్ రంగ’, ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’, ‘ఫోకస్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించింది.
ఆర్జీవితో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో తెగ ట్రెండ్ అయిన ఆశు, తన స్టైల్, ధైర్యంతో యూత్‌లో ప్రత్యేక క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా చాందినీ చౌదరి లీడ్ రోల్‌లో వచ్చిన ‘యేవం’ చిత్రంలో కూడా ఆశు కనిపించి ఆకట్టుకుంది.
బీచ్ ఫొటోషూట్‌తో మళ్లీ వార్తల్లోకెక్కిన ఆశు రెడ్డి.. ఫ్యాషన్, గ్లామర్‌ను మేళవించి సోషల్ మీడియాలో దూసుకెళ్తోంది.