టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్‌కు బాహుబలి ప్రభాస్ అండగా నిలిచారు. రెండు కిడ్నీలు పనికిరాకపోవడంతో ఫిష్ వెంకట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆపరేషన్‌కు సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చవుతుందని అతని కుమార్తె స్రవంతి మీడియాకు వెల్లడించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న హీరో ప్రభాస్, తన టీమ్ ద్వారా ఆపరేషన్‌కు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ‘‘కిడ్నీ డోనర్ లభించిన వెంటనే ఆపరేషన్‌కు సిద్ధం కావాలి. అవసరమైన మొత్తాన్ని ప్రభాస్ భరిస్తారు’’ అని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి స్వయంగా వెల్లడించారు.
ఫిష్ వెంకట్‌కు అండగా హీరో ప్రభాస్
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్
తన తండ్రి పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని, ఆపరేషన్‌కు రూ.50 లక్షలు ఖర్చవుతుందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన ఫిష్ వెంకట్… https://t.co/XTawJTGahy pic.twitter.com/WtvqneyWFc
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025
ప్రస్తుతం వారు సరిపోయే కిడ్నీ డోనర్ కోసం వెతుకుతున్నారు. తాను డోనర్ కావాలనుకున్నా, తండ్రి బ్లడ్ గ్రూప్‌కు తాను మ్యాచ్ కాలేదని, తమ్ముడు ముందుకొచ్చినా ఆరోగ్య సమస్యల కారణంగా డాక్టర్లు నిరాకరించారని చెప్పింది. దీంతో ఇతరులు ముందుకొస్తే నాన్నకు జీవితం అందించే అవకాశముంటుందన్నారు.
గత నాలుగేళ్లుగా డయాలసిస్‌తోనే జీవిస్తున్న ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ఇటీవల మరింత క్షీణించింది. దీంతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
‘గబ్బర్ సింగ్’, ‘నాయక్’, ‘ఆది’, ‘బన్నీ’, ‘డీ’, ‘రెడీ’, ‘కింగ్’, ‘డీజే టిల్లు’ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను అలరించిన ఫిష్ వెంకట్‌కు సినీ పరిశ్రమ నుంచి ఆదరణ వెల్లువెత్తుతోంది. ఇప్పుడు ప్రభాస్ అండతో ఫిష్ వెంకట్ ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.