బోనీ కపూర్ కూతురు ఎంగేజ్‌మెంట్.. పెళ్లికి సిద్ధమవుతున్న స్టార్ ఫ్యామిలీ!

బాలీవుడ్ నిర్మాత, నటుడు బోనీ కపూర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమార్తె, హీరో అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. జులై 3న ఆమె తన చిరకాల స్నేహితుడు రోహన్ ఠక్కర్‌తో నిశ్చితార్థం చేసుకుంది. న్యూయార్క్‌లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విషయాన్ని అన్షులా స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు, కుటుంబ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చెల్లెల్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు ‘మా అక్క ఎంగేజ్ అయింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

అన్న అర్జున్ కపూర్ సైతం భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ‘మీ ఇద్దరికీ సంతోషకరమైన జీవితం ఉండాలి. ఈ రోజు అమ్మను కాస్త ఎక్కువగా మిస్ అయ్యాను. లవ్ యూ గైస్’ అంటూ అన్షులా, రోహన్‌లకు విషెస్ తెలియజేశాడు. ఇప్పుడు ఈ సెలబ్రిటీ నిశ్చితార్థ వేడుక బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply