తెలంగాణలో అంగన్వాడీ హెల్పర్లకు శుభవార్త. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందే గరిష్ట వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి సీతక్క గురువారం సంబంధిత ఫైల్‌పై సంతకం చేశారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 50 ఏళ్ల వయస్సు కలిగిన సుమారు 4,322 మంది అంగన్వాడీ హెల్పర్లకు టీచర్ పదోన్నతి అవకాశాలు కలిగే అవకాశం ఉంది.
అంగన్వాడీ హెల్పర్ల యూనియన్ల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి సీతక్క, వయో పరిమితి పెంపునకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించమని అధికారులకు సూచించారు. 50 ఏళ్ల లోపు అర్హులైన హెల్పర్లకు పదోన్నతి ఇచ్చేందుకు ఎలాంటి అవరోధం లేదని అధికారులు నివేదికలో స్పష్టం చేశారు.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..
అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ పొందే హెల్పర్ల గరిష్ట వయసును 45 నుంచి 50 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయం
తాజా నిర్ణయం వల్ల 45 ఏళ్లు దాటిన హెల్పర్లకు ప్రయోజనం
45 నుంచి 50 ఏండ్ల మధ్యలో 4322 మంది అంగన్వాడీ హెల్పర్లు
వీరందరికీ… pic.twitter.com/qsLuvJvL6b
— Telugu Stride (@TeluguStride) July 3, 2025
ఇంతకుముందు అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 65 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో, 50 ఏళ్లకు టీచర్‌గా పదోన్నతి పొందిన హెల్పర్లు ఇంకా 15 సంవత్సరాలు సేవలందించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇందుకు అనుగుణంగా, 45 ఏళ్లు దాటిన అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వడంలో ఎలాంటి అడ్డంకులు లేవని తేల్చడంతో, మంత్రి సీతక్క నిర్ణయాత్మకంగా ఫైల్‌పై సంతకం చేశారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ హెల్పర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్కకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.