హరి హర వీరమల్లు ట్రైలర్ దుమ్ములేపింది.. యోధుడిగా పవన్ కళ్యాణ్ మ్యానరిజం అదిరిపోయిందిగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో హరి హర వీరమల్లు ఒకటి. చాలా కాలం క్రితమే షూటింగ్ ప్రారంభమైనా, పలు కారణాల వల్ల ఈ సినిమా వరుసగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఫైనలిగా మేకర్స్ భారీ అప్డేట్‌తో ముందుకొచ్చారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ యోధుడిగా తన శైలి, మ్యానరిజం, డైలాగ్ డెలివరీతో స్క్రీన్‌ను షేక్ చేశాడు. మూడు నిమిషాల ఒక సెకను నిడివి ఉన్న ట్రైలర్‌లో పవన్‌కు సంబంధించిన ఎలివేషన్ సీన్స్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమా మొదట క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. అయితే కొంతకాలం తర్వాత దర్శకత్వ బాధ్యతలు నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ స్వీకరించారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

చిత్రయూనిట్ ప్రకటించిన ప్రకారం, హరి హర వీరమల్లు సినిమా జూలై 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ట్రైలర్ స్క్రీనింగ్ విషయానికొస్తే.. హైదరాబాద్‌ ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జూలై 2న భారీ స్క్రీనింగ్ ప్లాన్ చేశారు. కానీ ఉదయం నుంచే భారీగా అభిమానులు ఎంట్రీ పాస్‌ల కోసం వచ్చిన నేపథ్యంలో, భద్రతా కారణాలతో ఈ ఈవెంట్‌ను చివరికి రద్దు చేశారు.

Leave a Reply