బుల్లితెరపై ఓ సీరియల్‌తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించిన నటి జ్యోతి పుర్వాజ్ ప్రస్తుతం పూర్తిగా మారిపోయిన లుక్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో కనిపించిన ఆమె, సంప్రదాయ హుందాతనంతో పాపులర్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా దగ్గరైంది. కానీ తాజాగా ఆమె పంచుకున్న గ్లామర్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జ్యోతి షేర్ చేసిన ఫోటోల్లో ఆమె పింక్ చీరకట్టుతో పాటు గ్లామర్ టచ్ ఇస్తూ స్టైలిష్ లుక్‌లో కనిపించింది. అభిమానులు ఒక దశలో గుర్తుపట్టలేకపోయేంతలా ఆమె లుక్‌లో తేడా కనిపించడంతో, ఆమె అసలు ఎవరనే చర్చ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న జ్యోతి, ఇప్పుడు వెబ్ సిరీస్‌లు, సినిమాలవైపు దృష్టి పెట్టింది. ప్రస్తుతం పూర్వాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘కిల్లర్’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇది సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
ఇందులో దర్శకుడు పూర్వాజ్ హీరోగానూ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.
కన్నడలో అనేక సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందిన జ్యోతి పుర్వాజ్, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది. కొత్త కథలు, వినూత్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ రెగ్యులర్‌గా ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోలతో యువతను ఆకర్షిస్తోంది.