హైదరాబాద్‌లో మీడియా స్వేచ్ఛపై సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కార్యాలయంపై బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు దాడికి దిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రసారమైన వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ దాడికి పాల్పడ్డారు.
ఆఫీస్ ఆస్తిపై దౌర్జన్యం
ఈ దాడిలో ఆ ఛానల్ కార్యాలయం తలుపులు, స్టూడియో గదులు ధ్వంసమయ్యాయి. కార్యాలయం బయట పార్క్ చేసి ఉంచిన వాహనాలపై కూడా బండరాళ్లతో దాడి చేశారు. మధ్యాహ్నం సమయంలో BRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో శాంతియుత నిరసనగా ప్రారంభమైనది, ఆపై ఉద్రిక్తతలకు దారి తీసింది. పలువురు పార్టీలో ఉన్న నేతలు కూడా గాయపడినట్లు సమాచారం.
మహా న్యూస్ కార్యాలయం మరియు సిబ్బంది పై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి…
మహా న్యూస్ కార్యాలయం ధ్వంసం…#BRS #MahaaNews #AP #TS pic.twitter.com/BNkslWjtRR
— IndiaGlitz Telugu™ (@igtelugu) June 28, 2025
కేటీఆర్ హెచ్చరిక తర్వాతే దాడి?
ఈ దాడికి కొద్ది గంటల ముందు కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై, తన పార్టీ నేతలపై మీడియా ముసుగులో కావాలనే దుష్ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. “అసత్యాలు, దురుద్దేశంతో చేసిన వ్యక్తిత్వ హననానికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం” అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఆ ప్రకటనలో, ‘‘కొంతమంది మీడియా సంస్థలు, వారి యజమానులు బీఆర్ఎస్ పార్టీపై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతున్నారు. ఈ చర్యలు నా శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులకు బాధ కలిగిస్తున్నాయి. వ్యక్తిత్వ హననం ద్వారా మా కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు’’ అని పేర్కొన్నారు.
Days haven't passed that we observed 'Samvidhan hatya divas ' which included attrocities and curbs on press during Emergency period. The @BRSparty and @KTRBRS hooligans in Telangana have resorted to their dirty tactics on Press freedom today destroying the " #MahaaNews Channel"… pic.twitter.com/7qObYZfR1w
— Ramesh Naidu Nagothu (@RNagothu) June 28, 2025
చట్టపరమైన చర్యలు తప్పవన్న కేటీఆర్
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపైన చట్టపరంగా ఎదురుతిరుగుతామని కేటీఆర్ హెచ్చరించారు. “చానెల్ పేరుతో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు ముఠాగా మారి తప్పుడు ప్రచారం చేస్తున్నారని” ఆయన ఆరోపించారు.
ఇంతలోనే హైదరాబాద్‌లో ఈ దాడి జరగడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. మీడియా స్వేచ్ఛను నెపంగా దాడులకు పాల్పడిన ఘటనపై అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర స్పందనలు వస్తున్నాయి.