ASHA Worker Jobs 2025: పదో తరగతి పాస్ అయితే చాలు.. 1294 ఆశా వర్కర్ ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళల అభివృద్ధి కోసం 1294 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. ఆసక్తి కలిగిన మరియు అర్హత ఉన్న మహిళలు జూన్ 30, 2025 లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి:

సంబంధిత గ్రామానికి చెందిన స్థానిక మహిళ అయి ఉండాలి

పదో తరగతి పాస్ అయి ఉండాలి (గుర్తింపు పొందిన పాఠశాల నుండి)

వయస్సు 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి

రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తించవచ్చు

ఇది రాత పరీక్ష లేకుండా, స్థానికత మరియు విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయబడే ప్రక్రియ. ఎంపికైన అభ్యర్థులకు అవసరమైన శిక్షణను ప్రభుత్వం అందించనుంది. శిక్షణ అనంతరం కాంట్రాక్ట్/హాజరు ప్రాతిపదికన విధుల్లో చేరవచ్చు. ప్రతి గ్రామానికి ఒక్క ఆశా వర్కర్‌ను నియమించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ:

నోటిఫికేషన్‌లో ఇచ్చిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి

అవసరమైన డాక్యుమెంట్లు: పాస్‌పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డు, స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల సర్టిఫికెట్లు, తల్లిదండ్రుల వివరాలు

ఇవన్నీ సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) కార్యాలయంలో జూన్ 30లోపు స్వయంగా సమర్పించాలి

ఈ పోస్టులు ప్రాథమిక ఆరోగ్య సేవలను గ్రామస్థాయిలో అందించేందుకు కేంద్రంగా మారనున్నాయి. మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో సేవా అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ నియామక ప్రక్రియ చేపట్టబడుతోంది.

Leave a Reply