శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేరా’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి వారాంతంలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి మూవీ యూనిట్‌కు భారీ విజయాన్ని అందించింది. ఈ ఘనతను సెలబ్రేట్ చేసుకుంటూ మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Wealth. Wisdom. And now… ₹100+CR worth of WAVE 🌊#Kuberaa rules with a grand century at the box office.🔥
Book your tickets now: https://t.co/4LlzXfPwzT #Kuberaa#BlockBusterKuberaa #SekharKammulasKuberaa #KuberaaInCinemasNow pic.twitter.com/xKr1UYXP60
— Kuberaa Movie (@KuberaaTheMovie) June 25, 2025
నాగార్జున, ధనుష్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా, సోషల్ డ్రామా నేపథ్యంలో సాగుతోంది. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడికి, వీధుల్లో నివసించే బిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణ ఈ చిత్రానికి ప్రాణం. నాగార్జున ప్రభుత్వ అధికారిగా మెప్పించగా, ధనుష్ బిచ్చగాడి పాత్రకి ప్రత్యేకంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
వాస్తవికతకు దగ్గరగా ఉండే లొకేషన్స్, ఆకట్టుకునే కథన శైలి ఈ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ‘లవ్ స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల కి ‘కుబేరా’ మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిందనే చెప్పాలి. ప్రేక్షకుల మద్దతుతో వసూళ్ల జోరు ఇంకా కొనసాగుతుండటంతో, సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.