Poco F7 5G: 7550mAh బ్యాటరీతో పోకో కొత్త గేమింగ్ 5G ఫోన్ విడుదల.. ధర, ఫీచర్లు తెలుసుకోండి

గేమింగ్‌ ప్రేమికులకు శుభవార్త. పోకో నుంచి సరికొత్త గేమింగ్ 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. పోకో F7 5G పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్ 7,550mAh భారీ బ్యాటరీతో పాటు పవర్‌ఫుల్ గేమింగ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇది గత ఏడాది వచ్చిన పోకో F6 5Gకి అప్‌గ్రేడ్ వెర్షన్. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ లభ్యం కానుంది.

ధర & వేరియంట్లు:

పోకో F7 5G రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతుంది:

12GB + 256GB – ₹31,999

12GB + 512GB – ₹33,999

జూలై 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుండగా, జూన్ 25 నుంచి ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బ్యాంక్ ఆఫర్లతో ₹2,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఫ్రాస్ట్ వైట్, సైబర్ సిల్వర్, ఫాంటమ్ బ్లాక్ అనే మూడు స్టైలిష్ కలర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది.

స్పెసిఫికేషన్లు:

ప్రాసెసర్: Qualcomm Snapdragon 8s Gen 4

రామ్: 12GB LPDDR5X (విస్తరణ సపోర్ట్‌తో)

స్టోరేజ్: UFS 4.1 టెక్నాలజీతో 512GB వరకు

కూలింగ్ సిస్టమ్: 6000mm² వేపర్ చాంబర్ – గేమింగ్‌కు స్పెషల్

ఓఎస్: Android 15 పై HyperOS 2

అప్‌డేట్స్: 4 సంవత్సరాల OS, 6 సంవత్సరాల సెక్యూరిటీ

బరువు: 222 గ్రా | తొడుగు: 7.98mm

రేటింగ్స్: IP66, IP68, IP69 (డస్ట్, వాటర్ రెసిస్టెన్స్)

కెమెరా సెటప్:

రిఅర్ కెమెరా:

50MP ప్రైమరీ

8MP అల్ట్రా వైడ్

ఫ్రంట్ కెమెరా: 20MP సెల్ఫీ

బ్యాటరీ & ఛార్జింగ్:

బ్యాటరీ సామర్థ్యం: 7550mAh

ఫాస్ట్ ఛార్జింగ్: 90W USB Type-C

రివర్స్ ఛార్జింగ్: 22.5W సపోర్ట్

డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు:


సైజ్: 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే

రిఫ్రెష్ రేట్: 120Hz

ప్రకాశం: 3,200 నిట్స్ (HDR10+ సపోర్ట్‌తో)

సెక్యూరిటీ: In-display Fingerprint Sensor

ప్రొటెక్షన్: Corning Gorilla Glass 7

ఈ ఫోన్ గేమింగ్, హై-పర్ఫామెన్స్ యూజ్‌కేసుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. బలమైన బ్యాటరీ, తక్కువ వేడి, ఫాస్ట్ చార్జింగ్, స్లిమ్ డిజైన్ లాంటి అన్ని మోడరన్ అవసరాలకు అనుగుణంగా ఉంది.

Leave a Reply