ఆంధ్రప్రదేశ్ పీజీఈసెట్-2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో మొత్తం 93.55 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది పీజీఈసెట్ పరీక్షలు మొత్తం 13 సబ్జెక్టులలో నిర్వహించగా, 14,231 మంది దరఖాస్తు చేయగా 11,244 మంది పాస్ అయ్యారు. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మీ ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://cets.apsche.ap.gov.in/PGECET/
హోం పేజీలో “Download Rank Card” లింక్‌పై క్లిక్ చేయండి
రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి
“View Rank Card” క్లిక్ చేయండి
మీ ర్యాంక్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది – దాన్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి
వాట్సాప్ ద్వారా మీ ర్యాంక్ ఇలా తెలుసుకోండి:
మొదటగా 9552300009 నెంబర్‌కు WhatsApp లో “Hi” అని మెసేజ్ చేయండి
వచ్చే మెసేజ్ లో ‘విద్యా సేవలు’ సెలెక్ట్ చేయండి
అందులో ‘ఏపీ పీజీఈసెట్ ఫలితాలు – 2025’ ఆప్షన్ ఎంచుకోండి
మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఇవ్వండి
మీ ర్యాంక్ కార్డ్ కనిపిస్తుంది – దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు