Vijay Varma: తమన్నాతో బ్రేకప్ చెప్పిన విజయ్ వర్మ.. ఇప్పుడు ఫాతిమాతో కొత్త లవ్ స్టోరీ?

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, తమన్నాతో గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించారు. ‘లస్ట్ స్టోరీస్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ జంట ప్రేమలో పడిందని, ఒకరిపై మరొకరు తెగ ప్రేమ చూపించారని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. కొంతకాలం పాటు పబ్లిక్‌గా కలిసి కనిపించి క్యూట్ కపుల్‌గా ట్రెండ్ అయ్యారు కూడా.

అయితే ఆ రిలేషన్ ఎక్కువకాలం నిలబడలేదు. ఇద్దరూ కలసి కనిపించడం మానేసారు. అధికారికంగా బ్రేకప్ ప్రకటించకపోయినా, ఇద్దరి సన్నిహితులు మాత్రం విడిపోయారని చెబుతున్నారు.

ఇక తాజాగా విజయ్ వర్మ మరో హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌తో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ముంబైలోని ఓ కేఫ్‌లో వీరిద్దరూ క్లోజ్‌గా కనిపించడం తో గాసిప్స్ కు బలం చేకూరింది.

ఫాతిమా సనా షేక్ బాలీవుడ్‌కి చిన్నప్పుడే ఎంట్రీ ఇచ్చి, ‘దంగల్’ చిత్రంతో స్టార్‌గా మారింది. తర్వాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లూడో’, ‘థార్’, ‘సామ్ బహదూర్’ వంటి చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది.

అయితే ఫాతిమా – విజయ్ కలిసి ‘గుస్తాఖ్ ఇష్క్’ అనే సినిమాలో నటిస్తుండటంతో, వాళ్లు కేవలం సహనటులు మాత్రమేనని, రిలేషన్ అంటూ చెప్పలేమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం వీరిద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ ఉందనే ప్రచారం చేస్తోంది.

Leave a Reply