టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘లక్ష్మీ కళ్యాణం’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి మెగా హీరోలతో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన కాజల్, గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని, ఓ కొడుకుకు తల్లిగా మారినా ఇంకా వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఇటీవల విడుదలైన ‘సికందర్’ చిత్రంతో మళ్లీ తెరపై మెరిసిన కాజల్, ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో కీలక పాత్ర పోషిస్తోంది. జూన్ 27న విడుదలకు సిద్ధమైన ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక సినిమాలతో పాటు కాజల్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఆమె, బీచ్‌లో వైట్ కలర్ బికినీలో ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నీటిలో హాట్‌గా ఫోజులిచ్చిన ఈ ఫోటోలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
కొందరు “ఫేమ్ కోసం బాడీ పార్ట్స్ చూపిస్తున్నావ్ కదా?” అంటూ కాజల్‌పై విమర్శలు గుప్పిస్తుండగా, మరికొందరు మాత్రం ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తూ ఆమె గ్లామర్‌ను ప్రశంసిస్తున్నారు.
ఇలాంటి ట్రోలింగ్‌కు అలవాటైన కాజల్ అయితే ఎలాంటి స్పందన ఇవ్వకుండా తన దైన స్టైల్‌లో ముందుకు సాగిపోతుంది.