TS EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2025 ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఎడ్‌సెట్‌ (TS EdCET) 2025 ఫలితాలను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఈ సంవత్సరం మొత్తం 38,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 32,106 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 96.38గా నమోదైంది. అర్హత సాధించిన అభ్యర్థులకు బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నారు.

టీఎస్ ఎడ్‌సెట్‌ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ విధానం:

ముందుగా TS EdCET అధికారిక వెబ్‌సైట్‌ https://edcet.tgche.ac.in/ ను ఓపెన్ చేయండి

హోమ్‌పేజ్‌లో “Download Rank Card” అనే లింక్‌పై క్లిక్ చేయండి

మీ హాల్ టికెట్ నంబర్, జన్మతేది వివరాలు ఎంటర్ చేయండి

“View Rank Card” అనే బటన్‌ను క్లిక్ చేయండి

స్క్రీన్‌పై మీ ర్యాంక్ కార్డు డిస్‌ప్లే అవుతుంది

దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు

గమనిక: ర్యాంక్ కార్డు బీఈడీ అడ్మిషన్ ప్రక్రియలో తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి సురక్షితంగా ఉంచుకోవడం మంచిది.

Leave a Reply