Sandeep Reddy Vanga: కొత్త కారు కొన్న సందీప్ రెడ్డి వంగా.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తనదైన మార్క్ వేసుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ల జాబితాలో నిలిచిన వంగా.. తన డైరెక్షన్‌కి తోడు లైఫ్‌స్టైల్‌ పరంగానూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్న సందీప్ వంగా.. ఈ ప్రాజెక్ట్ మొదట్లో దీపికా పదుకొణె ని హీరోయిన్ గా అనుకుని, చివరకు యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా వంగా తన గ్యారేజీలోకి కొత్త కారును తీసుకువచ్చారు. అదే యూరప్ స్పెషల్ బ్రాండ్ అయిన మినీ కూపర్. స్టైలిష్ గ్రీన్ షేడ్‌లో ఉన్న ఈ కారు కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కారు ముందు పూలతో అలంకరించి, హారతి కార్యక్రమంలో సందీప్‌తో పాటు అతని సతీమణి పాల్గొనడం ఫోటోలలో కనిపిస్తోంది. ఈ మినీ కూపర్‌కి TG09 TR 7395 అనే నెంబర్ ప్లేట్ రిజిస్టర్ చేయించుకున్నారు.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో మినీ కూపర్ కార్ల ధరలు సుమారుగా రూ.42.7 లక్షల నుంచి రూ.55.9 లక్షల మధ్య ఉంటాయి. సందీప్ వంగా ఎంచుకున్న మోడల్‌ను చూస్తే దీని ధర రూ.50 లక్షలకు పైగానే ఉండే అవకాశం ఉంది.

మొత్తానికి వంగా స్టైల్‌కు తగ్గట్టుగానే ఆయన కారు కూడా ఎంతో స్టైలిష్‌గా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

Leave a Reply