Yoga Day 2025: యోగా డే సెలబ్రేషన్స్.. LB స్టేడియంలో తళుక్కుమన్న సినీ తారలు!

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) పురస్కరించుకొని నిర్వహించిన కౌంట్‌డౌన్ కార్యక్రమం ఈరోజు (జూన్ 20) సందడిగా సాగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా పాల్గొన్నారు.

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు యోగాసనాల్లో పాల్గొంటూ యోగా ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఇక సినీ తారల హాజరుతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, యంగ్ హీరో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి, ఖుష్బూ లాంటి స్టార్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. వారు యోగాసనాలు చేయడమే కాదు, తమ స్పీచ్‌లతో మద్దతు తెలిపి, ప్రజలలో ఉత్తేజాన్ని నింపారు.

విద్యార్థులు, యోగా బోధకులు, అభ్యాసకులు, ప్రభుత్వ ఉద్యోగులు, యోగా నిపుణులు సహా అన్ని వయస్సులవారూ ఈ వేడుకలో చురుకుగా పాల్గొన్నారు. మొత్తం 40,000 మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Leave a Reply