పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజాసాబ్’ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. జూన్ 16 ఉదయం 11:30 గంటలకు మేకర్స్ ఈ టీజర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ ఎంటర్‌టైనర్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ యాక్షన్ మూవీస్ తర్వాత ప్రభాస్ పూర్తిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. కామెడీ, రొమాన్స్, హారర్ జానర్స్ మేళవింపుతో వస్తోన్న ఈ సినిమా, ప్రభాస్‌ను వినోదభరితమైన కొత్త అవతారంలో చూపించబోతోంది. ముఖ్యంగా ‘బుజ్జిగాడు’ తరహాలో ఫుల్ ఫన్ పంచ్ డైలాగ్స్‌తో టీజర్ ఆకట్టుకుంది.
My Rebel star ✨❤️🔥 #Prabhas #TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/wJ03y2vE7r
— DZ❗ (@dzrebel69) June 16, 2025
మొత్తం 2 నిమిషాలు 2 సెకన్ల నిడివి గల ఈ టీజర్‌లో గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ టాప్ నాచ్‌గా ఉన్నాయి. ప్రభాస్ వింటేజ్ లుక్, మ్యాజికల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మేకర్స్ ఎలివేషన్ల పండుగే ఇచ్చారు. నవ్విస్తూ, హారర్ కంటెంట్‌తో భయపెట్టే లుక్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
STAR STAR REBEL STAR 🌟 #Prabhas #TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/dcRXAElb1J
— The RajaSaab (@rajasaabmovie) June 16, 2025
‘ది రాజాసాబ్’ మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అభిమానులు ప్రభాస్‌ను మరోసారి భిన్నమైన పాత్రలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే టీజర్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుండగా.. సినిమా ఇంకా ఎంత ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతోందో తెలుసుకోవడానికి మాత్రం రిలీజ్ వరకు వేచిచూడాల్సిందే!