Kannappa Trailer: కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది.. ప్రభాస్ నటనతో అంచనాలు పెరిగిపోయాయి!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి అగ్రతారలు నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహాభారతం సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్, ఈ చిత్రానికి మెగా ఫోన్ పట్టారు. ట్రైలర్ విడుదలతోనే సినిమాపై ఉన్న హైప్ మరింత పెరిగిపోయింది.

ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో రూపొందిన విజువల్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుందని ట్రైలర్ చెబుతోంది. మంచు విష్ణు ‘తిన్నడు’ పాత్రలో, ప్రభాస్ ‘రుద్ర’ పాత్రలో, అక్షయ్ కుమార్ ‘శివుడు’గా కనిపించనుండగా.. వారి లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధుబాల, కాజల్ వంటి నటీమణులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్థాయిని పెంచాయి. ముఖ్యంగా మంచు విష్ణు – ప్రభాస్‌ల మధ్య సీన్లు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 27న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Leave a Reply