NEET UG Results 2025: నీట్ UG 2025 ఫలితాలు విడుదల.. టాపర్స్ జాబితా, లింక్ వివరాలు ఇవే..!

ఉత్కంఠకు తెరపడింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన NEET UG 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థుల ఆతృతకు ఇవే సమాధానం.

ఈ ఫలితాలను జూన్ 14న మధ్యాహ్నం 2 గంటలకు neet.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in వెబ్‌సైట్లలో అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఆదివారం విడుదలయ్యే ఫలితాలు ఈసారి ముందుగానే విడుదల కావడం విశేషం.

NEET పరీక్షల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న MBBS, BDS, AYUSH తదితర కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఈ సంవత్సరం మే 4న, 4,750 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 23.85 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 13.5 లక్షల మంది బాలికలు కాగా, 10.35 లక్షల మంది బాలురు.

ఫలితాల చెక్ చేయడం ఎలా?

neet.nta.nic.in / nta.ac.in / ntaresults.nic.in వెబ్‌సైట్లలోకి వెళ్లాలి.

“NEET UG 2025 Result” అనే లింక్‌ను క్లిక్ చేయాలి.

మీ రోల్ నంబర్, పుట్టిన తేది, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి.

సబ్మిట్ చేసిన తర్వాత ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ర్యాంక్, మార్కులు, ఇతర వివరాలతో పాటు స్కోర్ కార్డు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టాప్ 10 ర్యాంకర్ల జాబితా ఇలా ఉంది:

గతేడాది రాహుల్ గ్రేస్ (720/720), అర్జున్ త్యాగి (715), శివం కుమార్ (714) టాప్ 3లో నిలిచారు. ఈసారి కూడా టాపర్లు మంచి మార్కులు సాధించారు. రాష్ట్రాల వారీగా కూడా టాపర్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది.

మహేష్ కుమార్ – ర్యాంక్ 1 (రాజస్థాన్)

ఉత్కర్ష్ అవధియా – ర్యాంక్ 2 (మధ్యప్రదేశ్)

క్రిషాంగ్ జోషి – ర్యాంక్ 3 (మహారాష్ట్ర)

మృణాల్ కిషోర్ ఝా – ర్యాంక్ 4 (ఢిల్లీ)

అవికా అగర్వాల్ – ర్యాంక్ 5 (ఢిల్లీ)

జెనిల్ వినోద్ భాయ్ భయాని – ర్యాంక్ 6 (గుజరాత్)

కేశవ్ మిట్టల్ – ర్యాంక్ 7 (పంజాబ్)

ఝా భవ్య చిరాగ్ – ర్యాంక్ 8 (గుజరాత్)

హర్ష్ కేదావత్ – ర్యాంక్ 9 (ఢిల్లీ)

ఆరవ్ అగర్వాల్ – ర్యాంక్ 10 (మహారాష్ట్ర)

ఈసారి మార్కుల గణాంకాలు ఇలా ఉన్నాయి:

ఫస్ట్ ర్యాంకర్ మహేష్ కుమార్ 686 మార్కులు సాధించారు.

628 మార్కులు దాదాపు 237 మందికి వచ్చాయి.

577 మార్కులు – 4,000 మంది

568 మార్కులు – 6,000 మంది

561 మార్కులు – 8,000 మంది

552 మార్కులు – 11,000 మంది

544 మార్కులు – 15,000 మంది

535 మార్కులు – 21,000 మంది

526 మార్కులు – 26,000 మంది వరకు అభ్యర్థులు ఉన్నారు.

ఇబ్బందులు ఎదురైతే?

ఫలితాల సమయంలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే NEET Helpline ద్వారా NTA సహాయం అందిస్తోంది.

📞 Helpline Number: 011-40759000

Leave a Reply