Sreeleela Birthday: హ్యాపీ బర్త్‌డే శ్రీలీల.. పవన్ ఉస్తాద్ టీమ్ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్!

యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రబృందం ఆమెకు ఓ ప్రత్యేక బహుమతి ఇచ్చింది. ఈ సినిమా నుంచి శ్రీలీల లేటెస్ట్ స్టిల్‌ను రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటికే ఈ చిత్రంలో ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటికీ, తాజా స్టిల్‌లో ఆమె మరింత గ్లామరస్‌గా, అందంగా కనిపిస్తోంది.

పవన్‌తో షూటింగ్‌లో బిజీగా శ్రీలీల!
పవన్ కళ్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌కు ఏడాదికి పైగా బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయింది. తాజా షెడ్యూల్‌కు పవన్ కళ్యాణ్ నాలుగు వారాల డేట్స్ కేటాయించగా, ఈ సన్నివేశాల్లో శ్రీలీల కూడా జాయిన్ అయ్యారు. దర్శకుడు హరీష్ శంకర్ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్న ఈ ఫేజ్‌లోనే శ్రీలీల స్టిల్‌ను విడుదల చేశారు.

ఈ సినిమా పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం. వారి కెమిస్ట్రీ తెరపై ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్
ప్రస్తుతం శ్రీలీల అరడజను సినిమాలతో బిజీగా ఉంది. పవన్ సినిమాతోపాటు, కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘జూనియర్’, రవితేజ సరసన ‘మాస్ జాతర’, అఖిల్ అక్కినేనితో ‘లెనిన్’, శివ కార్తికేయన్‌తో ‘పరాశక్తి’, కార్తిక్ ఆర్యన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ‘ఆషిఖి 3’ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఇంకా కొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయి.

Leave a Reply