Akhanda2 Teaser: బాలయ్య ‘అఖండ 2’ టీజర్ రిలీజ్.. పవర్‌ఫుల్ డైలాగ్‌తో గూస్ బంప్స్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ అయింది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఒక రోజు ముందే విడుదలైన ఈ టీజర్ ఫ్యాన్స్‌లో పూనకాలే తీసుకొచ్చింది.

దర్శకుడు బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అఖండ’ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే ఫామ్‌తో ‘అఖండ 2’ సీక్వెల్ రూపంలో వస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై టీజర్ తో మరింత క్రేజ్ పెరిగింది.

బాలయ్య తనదైన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. “నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కన్నెత్తి చూడడు… నువ్వు చూస్తావా?” అంటూ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది.

థమన్ సంగీతం ఈ టీజర్‌కు వెన్నెముకలాంటిది. బీజీఎం ఒక స్థాయిలో ఉండి టీజర్‌కు మరింత ఇంపాక్ట్ తీసుకువచ్చింది. విజువల్స్, మేకింగ్ అన్నీ టాప్ లెవల్లో ఉన్నాయి.

ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తుండగా, నందమూరి తేజస్విని సమర్పణలో వస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Leave a Reply