Mahesh Babu: వామ్మో! ఒక్క టీ-షర్ట్‌కి అన్ని లక్షలా..? అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ లుక్ వైరల్..!

అక్కినేని అఖిల్ & జైనాబ్ రిసెప్షన్‌ వేడుక ఆదివారం రాత్రి సినీ తారల సందడితో అట్టహాసంగా ముగిసింది. ఈ వేడుకలో హాజరైన సెలెబ్రిటీల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్‌ ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. సంప్రదాయ దుస్తులకు బదులుగా సింపుల్ టీ-షర్ట్‌లో కనిపించిన ఆయన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

ఫ్యాషన్‌పై మహేష్ బాబు ఓ ప్రత్యేకశ్రద్ధతో ఉంటారు. రిసెప్షన్‌కి ఆయన ధరించిన ఫుల్ స్లీవ్ టీ-షర్ట్‌కి సంబంధించిన వివరాలు వెలుగులోకి రాగానే నెటిజన్లు షాక్‌కి గురయ్యారు. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ ‘హెర్మేస్’కి చెందిన ఈ టీ-షర్ట్‌ ధర సుమారు రూ.1.51 లక్షలు అని తెలిసింది.

సింపుల్ లుక్-స్టైలిష్ ధర

మహేష్ లుక్ ఎంత సింపుల్‌గా ఉన్నా, ధర విషయంలో మాత్రం అదిరిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో మిమ్స్, కామెంట్ల వర్షం ప్రారంభమైంది. మరింత ఆసక్తికరంగా, మహేష్ బాబు కూతురు సితార కూడా పేస్టల్ పింక్ లెహంగాలో ఎంతో అందంగా మెరిసింది.

ఇంత చిన్నదైన టీ-షర్ట్‌కి లక్షన్నర ధర పెట్టి స్టైలీష్‌గా మెరిసిన మహేష్ బాబు లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply