Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..!

కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలో ఉన్న కుమార్తె ప్రియాంకా గాంధీ నివాసానికి వెళ్లారు. అయితే అక్కడే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు సమాచారం.

సోనియాను వెంటనే శిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యల తీవ్రతపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అయితే, అవసరమైతే మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించే అవకాశమూ ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ వర్గాలు సోనియాగాంధీ ఆరోగ్యంపై స్పందించాల్సి ఉంది. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Leave a Reply